రేపిస్ట్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది

41
Kamalakar Reddy Hard comments On Dubbaka Bjp Candidate Rangunandan rao
Kamalakar Reddy Hard comments On Dubbaka Bjp Candidate Rangunandan rao

Kamalakar Reddy Hard comments On Dubbaka Bjp Candidate Rangunandan rao

రఘునందన్ రావుపై దుబ్బాక నియోజవర్గ BJP నేత తోట కమలాకర్ రెడ్డి ధ్వజం..

రఘునందన్ రావు ఒక రేపిస్ట్. ఆయనకు టికెట్ ఎలా ఇస్తారు. గతంలో కరీంనగర్ అధ్యక్షుడు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే తోలించారు మరి అదే రఘునందన్ వర్తించదా? కమలాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. రఘు నందన్ రావుకు దుబ్బాక టికెట్ విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచించాలన్నారు. ఒక రేపిస్ట్ టికెట్ ఇవ్వడం పార్టీ ప్రతిష్ట దిగజారుతదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ కేస్ నుండి నిర్దోషిగా వస్తే తప్ప పార్టీ కార్యకలాపాలలో పాల్గొన అంటివి ఇప్పుడు నిర్దోషివి అయ్యేవా? అని రఘునందన్ రావుకు సూటి ప్రశ్న వేశారు. ఎన్నికలు వస్తే ,ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే తప్ప, దుబ్బక గుర్తుకు రాదు ఆయానకా మీరు టికెట్ ఇచ్చేది? అని ఎద్దేవా చేశారు. రఘు నందన్ రావు ఏనాడూ బిజెపి పార్టీ కోసం పని చేయలేదని, పార్టీ ని అడ్డు పెట్టుకొని లక్షలాది రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.

రాజకీయాల్లో విలువల కోసం పాటు పడ్డ అద్వానీ, వాజ్ పాయి, బంగారు లక్ష్మణ్, మోడీ లాంటి నేతలు ఉన్న BJP లో రఘునందన్ లాంటి నీచ మైన వ్యక్తికి టిక్కెట్ రావడం బాధాకరమన్నారు. రఘు నందన్ రావు రాష్ట్ర BJP ని బ్లాక్ మైల్ చేస్తూ టికెట్ సంపాదిస్తున్నాడన్నారు. మంత్రి శ్రీనివాస్ అనే పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాత్రమే పార్టలో రఘు నందన్ రావు కు మద్దతుగా నిలిచి టిక్కెట్ ఇప్పిస్తున్నాడని, రఘునందన్ రావు కు మంత్రి శ్రీనివాస్ కు ఉన్న సంబంధం ఏమిటో త్వరలోనే బయట పడుతుందని చెప్పారు. రఘు నందన్రావు తన స్వార్థం కోసం దుబ్బాక నియోజకవర్గం లోని కరుడు గట్టిన బీజేపీ కార్యకర్తల ను ,నాయకులను  పార్టీ నుండి బయటకు పంపించాడన్నారు. రఘు నందన్ రావు ఇప్పటివరకు నిలబడ్డ ఏ ఎన్నికల్లోనూ గెలవ లేదు. దుబ్బాక నుండి రెండు సార్లు పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఎంపీ కి పోటీ చేసి…B ఫామ్ వచ్చినాక కనీసం ప్రచారం కూడా చేయలేదు జడ్పీటీసీ గా పోటీచేసికూడా ఓడి పోయాడు..MLC గా పోటీ చేసి ఓడి పోయాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కమలాకర్ రెడ్డి. రఘు నందన్ రావు చరిత్ర అంతా అవినీతి మయం… సిద్ధిపేట నుండి కట్టు బట్టలతో పంటాన్ చేరు వెళ్లిన రఘునందన్ రావు కోట్లకు ఎలా  పడగలెత్తాడని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గం లో ఒక్క చనిపోయిన ఒక్క బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని కూడా రఘు నందన్రావు ఆదుకోలేదు. కనీసం పరామర్శించ లేదు. డబ్బు కోసం నయీమ్, అసదుద్దీన్ ఒవైసీ,కేసులు వాదించిన ఘనత రఘు నందన్ రావుదనని మండిపడ్డారు. అమాయక మహిళనను వ్యభిచారం వృత్తి లోకి దించి విదేశాలకు అక్రమ రవాణా చేసిన ఘనత రఘునందన్ రావుది,  మల్లన్న సాగర్ ముంపు బాధితుల పక్షాన కేసు వేస్తానని బెదిరించి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన చరిత్ర రఘు నందన్ రావుది. ఇలాంటి అవినీతి పరునికు బీజేపీ టిక్కెట్ ఎలా ఇస్తుంది? అని బీజేపీ నేత కమలాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here