c/o kancharapalem sensational news
తెలుగులో గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించిన `కేరాఫ్ కంచెరపాలెం` సినిమాను ముందుగా నేషనల్ అవార్డ్స్‌కు అప్లై చేసుకోవడానికి కేంద్ర అనుమతి లభించలేదు. దాంతో తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ చొరవ తీసుకుని `కేరాఫ్ కంచెరపాలెం` సినిమాను నేషనల్ అవార్డ్స్‌కు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ ఇన్‌ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కేరాఫ్ కంచెరపాలెం సినిమా యూనిట్‌ను నేషనల్ అవార్డ్స్‌కు అప్లై చేసుకోవచ్చునని తెలియజేశారు. ఒక వ్యక్తి జీవితంలో నాలుగు దశల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల, విమర్శల ప్రశసంలు దక్కింది.