ఆమిర్‌, ఆలియాల‌పై కంగ‌నా ఫైర్‌

Kangana Fires on Amir , ALIA
`మ‌ణిక‌ర్ణిక‌:  ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` స‌క్సెస్‌తో కంగ‌నా ర‌నౌత్ రేంజ్ న‌టిగా మ‌రో మెట్టుకు ఎదిగింది. సాధార‌ణంగా ఫైర్‌తో ఉండే ఈ లేడీ షాట్ గ‌న్ ఇప్పుడు త‌న మాట‌ల‌కు మ‌రింత ప‌దును పెంచుతుంది. ఆమె రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బాలీవుడ్ స్టార్స్ ఆమిర్‌, ఆలియాల‌పై మాట‌ల తూటాను పేల్చింది. కంగ‌నా మాట్లాడుతూ “ క్వీన్ సినిమాను ఫాంట‌మ్ సినిమా నిర్మించింది. క్వీన్ క్రెడిట్ అంతా ఆ సంస్థ‌కే ద‌క్కింది. స్క్రీనింగ్‌లో కూడా ఆ సంస్థ సినిమాల గురించే మాట్లాడేవారు. నా గురించి ఎవ‌రూ మాట్లాడేవారు కారు. నా సినిమా స్క్రీనింగ్‌కి ఎవ‌రూ వ‌చ్చేవారు కాదు. వారికేద‌న్నా అవ‌స‌రం వ‌స్తే సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేసేవారు. నేను నా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మ‌రీ వెళ్లేదాన్ని. `రాజి` సినిమా స‌మ‌యంలో నాకు లింక్ పంపి ఆలియా ఫోన్ చేసి చూడ‌మ‌ని రిక్వెస్ట్ చేసింది. నేను త‌న‌కోసం కాకుండా దేశం కోసం పోరాడిన సెహ‌మ‌త్ ఖాన్ అనే మ‌హిళ క‌థ కాబ‌ట్టి ఆ ట్రైల‌ర్ చూశాను. అలాగే `దంగ‌ల్‌` సినిమా స‌మ‌యంలో కూడా ఆమిర్‌ఖాన్ సినిమా గురించి అంబానీ నివాసానికి వెళ్లార‌ని తెలిసి నేను కూడా వెళ్లాను. సినిమా బాగుందంటూ వారితో చ‌ర్చించాను. కానీ నా సినిమా స్క్రీనింగ్‌కు వారెవ్వ‌రూ రాలేదు“ అంటూ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు కంగ‌నా ర‌నౌత్‌.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article