త‌న బ‌యోపిక్‌కి త‌నే డైరెక్ట‌ర్‌

Kangana ill Direct Her own Biopic
కంగనా ఏదీ చేసిన విల‌క్ష‌ణంగానే చేయాల‌నుకుంటుంది.. చేస్తుంది కూడా. ఇటీవ‌ల విడుద‌లైన `మ‌ణిక‌ర్ణిక‌`తో స‌క్సెస్‌ను సొంతం చేసుకుని ద‌ర్శ‌కురాలిగా కూడా త‌నెంటో ప్రూవ్ చేసుకుంది. ఇటీవ‌ల ద‌ర్శ‌క‌త్వం గురించి అడిగిన ప్ర‌శ్న‌కు త‌న బ‌యోపిక్‌కు తానే డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హరించాల‌నుకుంటున్నాన‌ని కంగనా తెలియ‌జేసింది. మ‌ణిక‌ర్ణిక‌కు క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ బ‌యోపిక్‌కు క‌థ‌ను అందిస్తార‌ట‌. త‌న జ‌ర్నీలో ఎదుర్కొన స‌వాళ్ల‌ను, త‌న‌కు సాయం చేసిన‌వాళ్ల‌ను, అవ‌మానించిన వాళ్ల‌ను కూడా పేర్లు చెప్ప‌కుండా ఈ బ‌యోపిక్‌లో చూపించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని కంగనా తెలిపారు. సినిమా రంగంతో సంబంధం లేక‌పోయినా చిన్న మారుమూల ప్రాంతం నుండి వ‌చ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు కంగ‌నా తెలిపింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article