కంగ‌నా వ‌ర్సెస్ ఉద్ధ‌వ్‌

46
kangana-uddhav-thackeray_1

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌, మ‌హారాష్ర్ట ముఖ్య‌మంత్రి మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు మాట‌ల‌తోనే స‌రిపెట్ట‌కున్న ఇద్ద‌రు ప్ర‌త్య‌క్ష దాడుల‌కు దిగే స్థాయికెళ్లింది. ముంబైను పీవోకే పోలుస్తూ ఆమె చేసిన కామెంట్లు పెద్ద దుమార‌మే లేపాయి. దీనికి బ‌దులుగా శివసేన పార్టీ కార్యకర్తలు కూడా మాటల యుద్ధానికి దిగారు. ముంబైలో తిరగనివ్వమని బెదిరించారు. కంగనా కామెంట్లను సీరియస్ గా తీసుకున్న మహారాష్ర్ట ప్రభుత్వం కంగ‌న భవనాన్ని కూల్చి వేతకు చర్యలు తీసుకుంది.

బుధవారం నాడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంగనా భవనాన్ని కూల్చివేసింది. దాంతో సీరియస్ అయినా కంగనా సోషల్ మీడియా వేదికగా మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతోంది. తాజాగా ’కంగనా వర్సెస్ ఉధ్ధవ్’ అని పేర్కొంటూ ట్విట్ చేశారు. భవన కూల్చివేతపై స్పందిస్తూ ‘కూల్చేసిన భవనం కిందనే పనిచేస్తానని, కొత్త భవనం కట్టుకునేది లేదని’ తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here