కన్హయ్య కుమార్‌ దేశ ద్రోహం కేసు

118
kanhaiya kumar case again
kanhaiya kumar case again

kanhaiya kumar case again

జేఎన్‌యూ మాజీ విద్యార్థి కన్హయ్య కుమార్‌ పై దేశ ద్రోహం కేసు విచారించాలను కేజ్రీవాల్ నేతృత్వంలోని  ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కన్హయ్య కుమార్ పై  దాఖలైన దేశద్రోహం కేసు విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఇక ఈ విషయంలో గతేడాది జనవరిలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. అనుమతి రాకపోవడంతో సుప్రీంను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

2016లో కన్హయ్య కుమార్‌.. జేఎన్‌యూ విద్యార్థి నేతగా ఉన్నాడు… ఆ సమయంలోనే పార్లమెంట్‌పై దాడి కేసు సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి నిర్వహించారని, భారత్ తుక్‌డా హోగా అంటూ నినాదాలు చేశారన్నది అతడిపై ప్రధాన ఆరోపణ. దీంతో కన్హయ్య, ఉమర్ ఖాలీద్‌, అనిర్బన్‌ భట్టాచార్య సహా పలువురు విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇక కేసులో విచారణ విషయంలో కేజ్రీవాల్‌దే అంతిమ నిర్ణయమని బీజేపీ తేల్చి చెప్పింది. దీంతో విచారణకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్‌. అయితే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతుండగా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని, ప్రస్తుతం బీహార్ ఎన్నికలకు ముందు విచారణకు ఆదేశించారని ఆరోపిస్తున్నాడు కన్హయ్య.  రాజకీయ ప్రయోజనాలకోసమే ఇన్నిరోజులు కేసును తొక్కిపెట్టారని కన్హయ్య కుమార్ అంటున్నారు.  విచారణను త్వరగా పూర్తి చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాడు.ప్రజలందరికీ తెలిసేలా విచారణ చెయ్యాలని కోరుతున్నాడు.

tags : kanhaiya kumar, JNU, Jawaharlal nehru university, JNU sedition case, kejriwal, delhi government, prosecution

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here