రాష్ట్రం జగన్ జాగీరా…

Kanna Lakshminarayana Fires on CM Jagan over AP Capital

ఏపీ సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన ఏపీలో రగడకు కారణం అయ్యింది . ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనలు పదో రోజుకు చేరుకున్నాయి. రాజధానిపై నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ ఉండటంతో అమరావతి ప్రాంతంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే క్రమంలో  బీజేపీ సీఎం జగన్  మూడు రాజధానుల ప్రకటనపై నిప్పులు చెరుగుతున్నారు. రాజకీయ పక్షాలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి వస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ప్రకటించింది. రాజధాని కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నేడు  మౌన దీక్ష చేశారు . ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో శుక్రవారం ఆయన మౌన దీక్షకు దిగగా  కన్నా మౌన దీక్షకు పలువురు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచారు. గంట పాటు ఈ మౌన దీక్ష కొనసాగింది.

 అనంతరం కన్నా మాట్లాడుతూ.. ‘‘అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేశారు.. రాష్ట్రాన్ని జగన్‌ సర్వనాశనం చేస్తారని ప్రజలు ఊహించలేదు. రాజధాని కోసం రైతులు త్యాగాలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది. గత ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ కోసం రాజధానిని వాడుకుంది. రాష్ట్రం తన జాగీరులా జగన్‌ వ్యవహరిస్తున్నారు. రాక్షసపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది. జీఎన్‌ రావు కమిటీ నివేదిక రాకముందే జగన్‌ ప్రకటన చేశారు. కేబినెట్‌ నిర్ణయం రాకముందే విశాఖలో వైసీపీ ఎంపీ పండగ చేసుకున్నారు. జగన్‌ అధికారంలోకి రాగానే రాజధానిపై కుట్రలకు బీజం వేశారు అంటూ కన్నా నిప్పులు చెరిగారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article