బంపర్ లాటరీతో మారిన కూలీ బతుకు చిత్రం

145
Kannur labourer wins Rs 12 crore lottery
Kannur labourer wins Rs 12 crore lottery

Kannur labourer wins Rs 12 crore lottery

అదృష్ట లక్ష్మి ఒక నిరుపేద ఇంటి తలుపు తట్టింది . కేరళలోని కన్నూర్‌కి చెందిన ఓ సాధారణ దినసరి కూలీకి రూ.12కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాత్రికే రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతని ఆనందానికి అవధుల్లేవు. గతంలో రూ.2వేలు,అంతకన్నా కాస్త ఎక్కువ మొత్తంలో లాటరీ మనీ గెలుచుకున్న అతనికి.. ఒక్కసారిగా ఇంత భారీ లాటరీ తగలడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన పొరున్నన్ రాజన్‌ (55) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య రజనీ స్థానిక అంగన్‌వాడీలో కాంట్రాక్ట్ సిబ్బందిగా పనిచేస్తోంది. పొరున్నన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు ఉన్నారు.

పొరున్నన్‌కు రెగ్యులర్‌గా లాటరీ టికెట్ కొనడం అలవాటు. అయితే కూలీ పనులతో వచ్చే డబ్బుతో అటు కుటుంబాన్ని పోషిస్తూ.. పిల్లలను చదివిస్తూ.. లాటరీ టికెట్లు కొనడం అతనికి కష్టమయ్యేది. ఈ క్రమంలో అతను అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.తగులుతుందో.. తగలదో తెలియని లాటరీ కోసం.. పొరున్నన్ ప్రతీసారి ఆశగా టికెట్ కొనేవాడు. అలా గతంలో రూ.2వేలు,అంతకంటే కాస్త ఎక్కువ మొత్తంలో లాటరీ తగిలాయి. ఆ డబ్బులతో అప్పులు తీర్చలేక.. చేసిన డబ్బులు అప్పులకు చాలక.. సతమతమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో కేరళ క్రిస్‌మస్ బంపర్ లాటరీ టికెట్ పొరున్నన్‌కు తగిలింది. రూ.12కోట్లు విలువ చేసే లాటరీ తగిలిందని తెలిసి అతను షాక్‌కు గురయ్యాడు.లాటరీ తనకే తగిలిందని తెలియగానే.. వెంటనే ఆ టికెట్‌తో స్థానిక కోఆపరేటివ్ బ్యాంకుకి వెళ్లి అధికారులతో మాట్లాడాడు. పన్నులు పోను రూ.7.2కోట్లు వస్తాయని అధికారులు అతనితో చెప్పారు. వచ్చిన డబ్బుతో ఇంటిపై తీసుకున్న రుణం,చేసిన అప్పులను తీర్చేస్తానని పొరున్నన్ చెబుతున్నాడు. అలాగే పిల్లలిద్దరిని బాగా చదివిస్తానని చెబుతున్నాడు. అలాగే గతంలో తనకు సాయం అందించినవారికి కూడా సహాయం చేస్తానని అంటున్నాడు.

Kannur labourer wins Rs 12 crore lottery ,lottery , daily wage labor , kerala, kannur , 12 crores,Tribal man wins ₹12-crore,Kerala Bumper Lottery Result

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here