బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్

Kapil dev suffered heart attack

ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కపిల్ కు ఆంజియో ప్లాస్టీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఆయనకు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ అనగానే క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. హర్యానా హరికేన్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు కూడా కపిల్ కోలుకోవాలని ట్విట్ చేస్తున్నారు. అయితే కపిల్ దేవ్ బయోపిక్ 83 పేరుతో రాబోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ దిగ్గజ ఆల్ రౌండర్లలో ఒకరైన కపిల్ దేవ్ సారధ్యంలోనే ఇండియా వరల్డ్ కప్‌ను 1983లో గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *