ప్రధానిని కలవడం అద్భత అవకాశం

karan johar met modi

  • కరణ్ జోహార్ వెల్లడి

నిత్యం రాజకీయాలు, ఇతరత్రా పనులతో క్షణం తీరిక లేకుండా గడిపే మన ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బాలీవుడ్ ప్రముఖులతో కలసి తళుక్కుమన్నారు. వారందరితో కలిసి చిరునవ్వు చిందిస్తూ ఫొటోకు పోజిచ్చారు. సినీ పరిశ్రమలోని పలు సమస్యలను విన్నవించేందుకుబాలీవుడ్‌ నటీనటులు రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌,వరుణ్‌ ధావన్‌, కరణ్‌ జోహర్‌ తదితరులు ఢిల్లీలో మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారంతా కలిసి మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫొటోను కరణ్‌ జోహార్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది ఒక్కసారిగా వైరల్ అయింది. ‘సరైన సమయంలో జరిపే శక్తివంతమైన చర్చలు చక్కని మార్పునకు నాంది పలుకుతాయి. ఈ రోజు ప్రధాని మోదీని కలవడం అద్భుతమైన అవకాశం. ఒక కమ్యూనిటీగా దేశ నిర్మాణానికి మా వంతు కృషి చేయడానికి సదా సిద్ధంగా ఉన్నాం. పారదర్శకమైన భారత్ నిర్మాణానికి మా వంతు సహకారం మేం అందిస్తాం’ అని కరణ్ పేర్కొన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి వారంతా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article