భోపాల్ బరిలో కరీనా?

KAREENA MAY CONTEST FROM BHOPAL

  • కాంగ్రెస్ నుంచి పోటీ చేయించే యోచన

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింతగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో భారీగా సీట్లు కొల్లగొట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ నటి కరీనా కపూర్ ను భోపాల్ లోక్ సభ నుంచి బరిలోకి దింపాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. కరీనాను భోపాల్ నుంచి లోక్ సభకు పోటీ చేయిస్తే గెలుపు తథ్యమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గుడ్డు చౌహాన్‌, ఆనీస్‌ ఖాన్‌ ఈ అంశంపై పార్టీ అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. భోపాల్‌లో బీజేపీని ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.. కరీనాను పోటీకి దింపితే కాంగ్రెస్ గెలుపు ఖాయమని వివరించినట్టు తెలుస్తోంది.

కరీనా కపూర్ కు భారీగా ఉన్న అభిమాన గణంతోపాటు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కొడలు కావడం కూడా కలిసొస్తుందని వారు యోచిస్తున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ తాత ఒకప్పుడు భోపాల్‌ నవాబ్‌గా ఉన్నారు. దాంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో కరీనా.. కాంగ్రెస్‌ తరఫున భోపాల్‌ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని గుడ్డు చౌహాన్‌ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. బీజేపీని ఎదుర్కొనే బలమైన అభ్యర్థి లేకపోవడం వల్లే కాంగ్రెస్ సినీతారలను నిలబెట్టాలని భావిస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు.

NATIONAL UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article