జర్నలిస్టులకు కర్నాటక తీపికబురు

15


జర్నలిస్టులను కొవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించిన రాష్ట్రాల్లో కర్నాటక కూడా చేరింది. ఇకపై రాష్ట్రంలోని జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తిస్తున్నట్టు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇవాళ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌లో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. దేశంలో కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు ఇప్పటికే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాయి. వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్య ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాలు జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వర్కర్స్ పరిధిలోకి తీసుకొచ్చాయి. కాగా కర్నాటకలో సోమవారం కొత్తగా మరో 44,438 మందికి కరోనా సోకినట్టు తేలింది. ఈ మహమ్మారి కారణంగా 239 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,46,303కి చేరగా.. మృతుల సంఖ్య 16,250కి పెరిగింది. కర్నాటకలో ప్రస్తుతం 4,44,734 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.*

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా యూపీ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి ఉచితంగా టీకాలు వేయాలని సీఎంవో నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టుల వంటి మీడియా నిపుణులకు ప్రత్యేక టీకాలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. 18 ఏళ్లు పైబడిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా టీకాలు వేయాలని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యూపీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. మరో వైపు రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కరోనా నియంత్రణకు యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here