కర్ణాటక రైతులను విడుదల చెయ్యాలన్న చంద్రబాబు

135
Karnataka Farmers Arrested
Karnataka Farmers Arrested

Karnataka Farmers Arrested

ఏపీలో రాజధాని అమరావతి కోసం పోరాటం సాగుతుంది. రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు తమ సంఘీభావం తెలపటానికి ఎపీకి వచ్చారు . అయితే పోలీసులు కర్నాటక రైతులను అరెస్ట్ చెయ్యటంతో వారి  అరెస్ట్‌ను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఖంఢించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే కర్ణాటక రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తానే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు వస్తానన్నారు. ఏ విధంగా విడుదల చేయరో చూస్తానన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు కర్ణాటక రైతులను తరలించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక రైతులు వస్తే తప్పా..? అని ప్రశ్నించారు. సాటి రైతులు కష్టంలో ఉన్నారని కర్ణాటక రైతులు వచ్చారని, తోటి రైతులకు సంఘీభావం చెప్పడమే వాళ్ల నేరమా..? అని నిలదీశారు. ఒక రైతుకు, మరో రైతు మద్దతివ్వడంలో తప్పేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

Karnataka Farmers Arrested,capital amaravati, karnataka farmers , chandrababu , krishna lanka , capital farmers , police station,Condemned by Chandrababu Naidu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here