KARNATAKA GOVERNMENT KEY DECISIONS ON THIS VEHICLES
కర్ణాటక సర్కారు పాత వాహనాలు రోడ్లపైకి రాకుండా కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్లపై తిరగకుండా నిషేధిస్తున్నట్టు కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తమ్మణ్ణ తెలిపారు. సోమవారం 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం తమ్మణ్ణ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే రాకపోకలపై ఆంక్షలు విధించామన్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
బెంగళూరులో కోటిమంది జనాభా ఉండగా.. కోటి వాహనాలు సంచరిస్తున్నాయని మంత్రి తమ్మణ్ణ వివరించారు. దీనికితోడు పొరుగు రాష్ట్రాల వాహనాలు లక్షలో సంఖ్యలో వస్తున్నాయన్నారు. బెంగళూరులో గాలి కాలుష్యంతోనే 4వేల మంది మృత్యువాత పడ్డారని.. భవిష్యత్తులో ఆ సంఖ్య పెరగకూడదనే 15 ఏళ్లకు పైబడిన వాహనాలను నిషేధిస్తున్నట్టు తెలిపారు.
బెంగళూరులో వాహన కాలుష్య నివారణకు 15ఏళ్లకు పైబడిన వాహనాలపై నిషేధం.. ప్రజారవాణ వ్యవస్థను పెంచడమే మార్గమని మంత్రి తమ్మణ్ణ స్పష్టం చేశారు. అందుకే బెంగళూరులో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నామని.. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
For More Click Here