తెలుగు దర్శకులకి తమిళ హీరోలు వరంగా మారారు.తెలుగు హీరోలు బిజీగా ఉన్నారంటే వెంటనే తమిళ హీరోలపై దృష్టిపెడుతుంటారు.అలా వాళ్లని మెప్పించి ప్రాజెక్టులు పట్టేసిన దర్శకులు ఈమధ్య చాలామందే కనిపిస్తున్నారు.వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి తర్వాత ఇప్పుడు పరశురామ్ కూడా అదే స్టైల్‌లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.గీత గోవిందం,సర్కారు వారి పాట సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా సత్తా చాటిన పరశురామ్.తదుపరి నాగచైతన్యతో సినిమా
కోసం కథ తయారు చేసుకున్నారు.ఆ కథపై కొన్ని చర్చలు కూడా జరిగాయి.కానీ ఏమైందో ఏమో.ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చేతులు మారుతున్నట్టు సమాచారం.
నాగచైతన్య `కస్టడీ`తో బిజీ కావడం,ఆ తర్వాత కూడా తనతో సినిమా చేసే పరిస్థితులు కనిపించకపోవడంతో పరశురామ్ తమిళ హీరో కార్తిపై దృష్టిపెట్టారు.ఇటీవలే ఆయనకి కథ వినిపించి ఓకే చేయించినట్టు సమాచారం.అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.