కార్తీ అంత త‌గ్గారా?

Karthy’s down..?

కార్తీ త‌గ్గారా అని అన‌గానే వెంట‌నే పారితోషికం గురించి మాట్లాడుతున్న‌ట్టు అనుకోవ‌ద్దు. కార్తి త‌గ్గిన మాట వాస్త‌వ‌మే. కానీ పారితోషికంలో కాదు. బ‌రువులో. ఆయ‌న తాజా సినిమా `దేవ్‌` కోసం చాలా త‌గ్గారు. ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా `దేవ్‌`. ఇందులో కార్తి, ర‌కుల్ క‌లిసి న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని కార్తి క్లోజ్ ఫ్రెండ్ ప్రిన్స్ పిక్చ‌ర్స్ ల‌క్ష్మ‌ణ్ నిర్మిస్తున్నారు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ త‌ల్లిగా ర‌మ్య‌కృష్ణ‌, కార్తి తండ్రిగా ప్ర‌కాష్‌రాజ్ న‌టిస్తున్నారు. హీరో, హీరోయిన్లు వెంట‌పడి ప్రేమించుకునే స‌న్నివేశాలు ఇందులో ఉండ‌వు. సినిమా ప్రారంభం కావ‌డ‌మే వారిద్ద‌రూ ఒక‌రికొక‌రు ప్రేమ‌ను చెప్పుకొన్నాకే మొద‌ల‌వుతుంది. మిగిలిన ల‌వ్‌స్టోరీల్లో చాలా వ‌ర‌కు క‌నిపించ‌ని మంచి కేర‌క్ట‌రైజేష‌న్ త‌న‌కు ఈ సినిమాలో క‌నిపించింద‌ని కార్తీ అంటున్నారు. అందుకే అంగీక‌రించిన‌ట్టు చెబుతున్నారు. ప్రేమ అనేది కేవ‌లం హీరో, హీరోయిన్ల‌కు మ‌ధ్య మాత్ర‌మే ఉండే ప్రేమ కాద‌ని, ప‌రిస‌రాల‌ను ప్రేమించ‌డం కూడా ప్రేమే అవుతుంద‌ని కార్తీ చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 14న ఈ సినిమా విడుద‌ల కానుంది. హారిస్ జైరాజ్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article