టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆదర్శ పార్లమెంటేరియన్ అవార్డ్

Trs MP Kavitha Got Adarsha Parliament Award

తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేమ్ ఇండియా ఎక్స్‌ట్రా ఆర్డినరీ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా – ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుపై కవిత తన ట్విట్టర్ అకౌంట్‌లో స్పందించారు. తనకు ఈ అవార్డు ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.
సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపి కవిత ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డుకు ఎంపికవ్వటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది .దేశవ్యాప్తంగా ఎంపీల పనితీరు, ప్రజల్లో ఆదరణ వంటి తదితర 10 అంశాలపై ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ అనే సంస్థ శ్రేష్ణ్ సంసద్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వివిధ విభాగాలపై వచ్చిన సర్వే ఫలితాల ఆధారంగా అత్యుత్తమ ఎంపీలను ఎంపికచేశారు. ఈ సర్వేలో నిజామాబాద్ ఎంపి కవిత దేశంలోని సీనియర్ ఎంపీలను వెనక్కినెట్టి ఉత్తమ పార్లమెంటీయన్ అవార్డుకు ఎంపికయ్యారు. రానున్న భవిష్యత్ కాలంలో అత్యంత ప్రభావితం చేయగల ఎంపిగా ఆమెను ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ అభివర్ణించింది. ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఈ అవార్డును అందుకోనున్నారు.ఈమెతో పాటు మరికొంత మంది ఎంపీలు కూడా ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డులు అందురకోనున్నారు. పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలు, వివిధ అంశాలపై జరిగే చర్యల్లో భాగస్వామ్యం, పార్లమెంట్ హాజరు, ప్రజల్లో వుండే ఆదరణ, సమాజ సేవలో భాగస్వామ్యం, రాజకీయాల్లో ప్రభావం ఇలా పది అంశాలపై సర్వే నిర్వహించి ఉత్తమ ఎంపీలను ఎంపికచేశారు. హాజరు విషయం ఒక్కటి మినహాయిస్తే అన్ని విభాగాల్లోనూ కవితకు 90శాతం కంటే మెరుగైన స్థానంలో వున్నారు. దీంతో ఆమె ఉత్తమ పార్లమెటేరియన్ గా ఎంపికయ్యారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article