Kavitha Daughter Of Warrior Says KTR
గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమె పరాజయం పాలైన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా మహిళలకు సంబందించిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది. అయితే తాజాగా ఆమె రాజకీయ భవిష్యత్తుపై స్పందించారు మంత్రి కేటీఆర్. కవిత ఫ్యూచర్ పొలిటికల్ జర్నీపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాజకీయాల్లో ఓటమి, గెలుపు అనేవి సహజం. గతంలో తెరాస పార్టీ సైతం ఓడింది. 2009 లో 45 చోట్ల పోటీ చేసి 10 అసెంబ్లీ స్థానాలే గెలిచింది. కానీ 2014 లో అద్భుత విజయం సాధించి తెలంగాణ రాష్ట్ర రూలింగ్ పార్టీగా అవతరించింది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చాలా సహజం. అంతే తప్ప ఒక్కసారి ఓడిపోతే ఇంకెప్పటికీ గెలవదని కాదు కదా అని అన్నారు మంత్రి కేటీఆర్. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక యోధుడి కూతురు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కవితకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందన్నారు. ముందు ముందు ఆమె ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న నాయకురాలిగా ముందుకు పోతుందన్నారు. అయామ్ వెరీ కాన్ఫిడెంట్. షి విల్ ఫైట్ ఇట్ అవుట్ అంటూ మాజీ ఎంపీ కవితపై ప్రశంసలు కురిపించారు కేటీఆర్…