రాహుల్ గాంధీ అసలు భార‌త్‌లో ఉన్నారా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస‌లు భార‌త్‌లోన ఉన్నారా? అని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎద్దేవా చేశారు. సిరిసిల్ల‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌టన నేప‌థ్యంలో ఈ విష‌యంపై క‌విత ఓ ఇంటర్వ్యూలో ( ANI ) మాట్లాడారు. తెలంగాణ‌లో కొన‌సాగుతున్న ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చూసి ఎవ‌రైనా నేర్చుకుని, తిరిగి వెళ్ళ‌వ‌చ్చ‌ని అన్నారు. సిరిసిల్ల‌లో కొన‌సాగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి రాహుల్ గాంధీ తెలుసుకుని, ఆయ‌న సొంత నియోజ‌క వ‌ర్గం వయానాడ్‌లో వాటిని అమలుచేయవచ్చు అని అన్నారు అయితే, త‌న‌తో పాటు దేశం మొత్తం రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారంటూ ఆశ్చ‌ర్య‌పోతోంద‌ని ఆమె చుర‌క‌లంటించారు. కాగా, భారీ వ‌ర్షాల వేళ‌ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు సాయం అంద‌ట్లేద‌ని ఆమె తెలిపారు. కేంద్ర స‌ర్కారు నుంచి తెలంగాణ‌కు ఎటువంటి వ‌ర‌ద స‌హాయ నిధి అంద‌లేద‌ని తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌కు మాత్రం ఆ నిధులు అందుతున్నాయ‌ని చెప్పారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article