బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ఎంపీ కవిత

MP Kavitha Receives Best Parliamentary Award

ఇండియాలో బెస్ట్ పార్లమెంటేరియన్ గా తెలంగాణ సీఎం కెసిఆర్ తనయ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మకమైన శ్రేష్ట్ సంసద్ అవార్డును అందుకుంది. ఫేమ్ ఇండియా ఏషియా ఫోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ కవితకు వివిధ అంశాలలో 90 శాతంపైగా పాయింట్లు దక్కాయి. తెలంగాణ ఉద్యమం, రాజనీతి, సామాజిక సేవా దృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఎంపీ కవితకు అవార్డు దక్కింది. ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తనకు అవార్డు లభించిందన్నారు.
మరింత ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం కొసాగిస్తామని పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఎంపి కవితకు అవార్డును అందజేశారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు. ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మ్యాగజైన్ ఆదర్శ పార్లమెంటేరియన్ విభాగంలో శ్రేష్ఠ్ సంసద్ పేరుతో సర్వే నిర్వహించి నిజామాబాద్ ఎంపీ కవితను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అవార్డును అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. మొత్తం 545 మంది ఎంపీలకు గాను సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేశారు. అందులో కవిత ఒకరు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article