వైఎస్సార్ సీపీలోకి కావూరి?

KAVURI MAY JOIN IN YSRCP?

  • ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న బీజేపీ నేత

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ మార్పులు కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు నేతలు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమీ సానుకూలంగా లేని విషయం అందరికి తెలిసిందే కదా. దీంతో ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఫిక్స్ అయిన కావూరి.. జగన్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్ సీపీ తరఫున ఏలూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆయన యోచిస్తున్నారు. అయితే, ఏలూరి ఎంపీ టికెట్ కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ కు ఇస్తానని జగన్ మాట ఇచ్చారు. మరి కావూరి కోరిక నెరవేరుతుందో లేక మరేదైనా సీటు ఆఫర్ చేస్తారో వేచి చూడాలి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article