KCR Against the Central Power bill
కేంద్రం ప్రభుత్వం తీసుకురానున్న విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ బిల్లును పార్లమెంట్ లో పాస్ కానివ్వకుండా పోరాడుతామని అన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేంద్రం మరింత ముందుకు వెళ్లితే తానే కార్యాచరణ రూపొందించి ఫైట్ చేస్తానన్నారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజామాయిషీని కేంద్రం తన చెప్పుచేతుల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రాల చర్యలకు అడ్డుకట్ట వేసి విద్యుత్ రంగాన్ని కాపాడాలని భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా కేంద్రం విద్యుత్ చట్టంలో పలు సవరణలను తీసుకురానుందని, రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టాల హక్కులను హరించేవిధంగా, రైతులు పేదల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉందని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.