ఏపీలో కేసీఆర్ రాజకీయాలా

KCR AP Politics…నెల్లూరులో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన

ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానన్న సీఎం కేసీఆర్ చంద్రబాబుపై చీటికీ మాటికీ విరుచుకుపడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోచంద్రబాబుకు చుక్కలు చూపించడానికి వ్యూహాలు రచిస్తున్నాడు సీఎం కేసీఆర్. అయితే ఏపీలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆటో డ్రైవర్ కెసిఆర్ పట్ల వినూత్న నిరసనకు దిగాడు.. తన ఆటో మీద కెసిఆర్ ని తిడుతూ ప్లెక్సీలు వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నాడు.

నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కుటుంబమంతా లబ్ధి పొంది ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో ఆయన మనసు నొచ్చుకున్నాయి. అందరిలా ఆయన ఊరికే ఉండలేదు. తను నడుపుతున్న ఆటో వెనుక ”ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌” అంటూ మూడు నెలల క్రితం ప్లెక్సీ అతికించాడు. ”నాన్న చనిపోతే రూ.50వేలు తక్షణ సాయం అందింది. అమ్మ విజయకు నెలా నెలా రూ.2వేల చొప్పున వృద్ధాప్య పింఛను, అక్క భర్త చనిపోతే ఆమెకూ రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం వచ్చింది. అన్న మురిళీకి ఇల్లొచ్చింది. ఇంత చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్లెక్సీ పెట్టా” నంటున్నాడు వెంకటేశ్వర్లు.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article