కేసీఆర్ పుట్టినరోజున మొక్క నాటండి

KCR birth Plantation … కేటీఆర్ పిలుపు

కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు గాని, అభిమానుల కానీ ఇలాంటి హడావిడి చేయొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దని, కెసిఆర్ మీద నిజంగా అభిమానం ఉన్న నాయకులు తాను చెప్పిన పని చేయాలని ఆయన సూచించారు. ఇంతకీ కేటీఆర్ ఏం చెప్పారో తెలుసా …
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదినోత్సవం ఫిబ్రవరి 17. తమ అభిమాన నేత బర్త్ డే వచ్చిందంటే సందడి అంతా ఇంత ఉండదు. ఎక్కడికక్కడ కేకులు కట్ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటారు. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేస్తూ…శుభాకాంక్షలు తెలియచేస్తూ భారీ హోర్డింగ్స్..ప్రకటనలు గుప్పిస్తుంటారు.
అయితే ఎలాంటి ఆర్భాటాలు చేయవద్దని కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. ఫిబ్రవరి 17వ తేదీన నాయకులు..కార్యకర్తలు తలా ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, ప్రకటనల వంటి ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకోవాలన్నారు. మరోవైపు కేసీఆర్ జన్మదినాన్ని కార్యక్రమం నిర్వహించేందుకు జాగృతి సంస్థ రెడీ అయ్యింది. ఫిబ్రవరి 17వ తేదీన పీపుల్స్ ప్లాజాలో ఉదయం 9గంటలకు అవయవ దాన సంకల్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article