ఏపీలో ఆసక్తి .. Jagan Birthday Wishes to KCR
తెలంగాణ సీఎం కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వేడుకలకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దని కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు. ఇక తెలంగాణ జాగృతి సైతం నేడు కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా అవయవ దాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఫిబ్రవరి 17, 1954లో ఆయన జన్మించారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు వీర మరణం పొందిన కారణంగా.. దేశవ్యాప్తంగా విషాద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులు కూడా తన పుట్టినరోజును జరపవద్దని ఆయన కోరారు.
అయితే.. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ గారు.. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో వైసీపీకి టీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్ కేసీఆర్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారనే విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కెసిఆర్ పుట్టినరోజున వైయస్ జగన్ చేసిన ట్వీట్ ఇరువురి మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు అద్దం పడుతుంది. ఒక పక్క చంద్రబాబుపై యుద్ధం చేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి చంద్రబాబును ఇరకాటంలో పెట్టనున్నారు. అందులో భాగంగానే జగన్ తో స్నేహానికి సిద్ధంగా ఉన్నారు. ఇక జగన్ సైతం కెసిఆర్ స్నేహ హస్తం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం ఈ ట్వీట్ తో అర్థమవుతోంది.
For More Click Here