కేసీఆర్ ప్రచారం సభ ఎందుకు రద్ధు?

kcr campaign cancelled due to rain
తెలంగాణాలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ నేడు హాజరు కావాల్సి ఉంది. కానీ భారీ వర్షం కురవటం వల్ల కేసీఆర్ ప్రచార సభ రద్దు అయ్యింది. హుజూర్ నగర్   సమరంలో గెలుపు ఎవరిదో అనే లెక్కలు తేలడం లేదు. టీఆర్ఎస్ నేతలు మాత్రం తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హుజూర్‌నగర్‌లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకావాల్సి ఉంది. కానీ ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో సీఎం సభకు వస్తారా రారా అన్న అనుమానం వుంది. అయితే ఆర్టీసీ సమ్మె కాకుండా ఆయన సభకు గైర్హాజరు కావటానికి భారీ వర్షం కారణంగా మారింది . రెండు గంటలుగా ఏకధాటిగా వర్షం కురవడంతో సీఎం సభను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా సీఎం ప్రయాణించే హెలీకాప్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. భారీ వర్షం, పిడుగులు పడే అవకాశాలున్నందున అనుమతి ఇవ్వలేదని ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి తెలిపారు. సీఎం సభకు అప్పటికే భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరాశతో వెనుతిరగాల్సివచ్చింది.
http://tsnews.tv/kalki-is-a-corrupt-empire/
http://tsnews.tv/governament-vs-rtc-workers/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *