ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదా?

kcr clarified about rtc

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు సీఎం కేసీఆర్‌. దాదాపు ఐదు గంటలకు పైగా తెలంగాణ కెబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యపై సుధీరంగా చర్చించామని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రసక్తే లేదన్నారు. ఇక 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించందన్నారు సీఎం కేసీఆర్‌. కేబినెట్‌ నిర్ణయంలో మార్పుండదు.. పర్మిట్లలోనూ మార్పులుండదన్నారు సీఎెం కేసీఆర్‌.

ఆర్టీసీ కార్మికులు అర్థం లేని డిమాండ్లతో సమ్మె చేస్తున్నారన్నారు సీఎం కేసీఆర్‌. చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే యాజమాన్యానికి, ఉద్యోగులకు సంబంధాలు కట్‌ అవుతాయన్నారు. ఇప్పటికే ఉద్యోగులతో సంబంధాలు కట్‌ అయ్యాయన్నారు. సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకుని ముందుకెళ్లొచ్చన్నారు. కార్మికులందరి నోట్లో మట్టి పడే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం కేసీఆర్‌. అయితే, కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు సీఎం కేసీఆర్‌. 67 శాతం జీతాలు పెంచిన చరిత్ర ఎక్కడా లేదన్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్‌ చేశామని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డల్లాంటి వాళ్లేనన్న ఆయన.. యూనియన్ల మాయలో కార్మికులు పడొద్దన్నారు. ఆర్టీసీ కార్మికులకు మరో ఛాన్స్‌ ఇస్తున్నామని, ఈ నెల 5 అర్థరాత్రిలోపు బేషరతుగా డ్యూటీలో చేరితే..వారికి భవిష్యత్‌ ఉంటుందన్నారు. అవకాశం సద్వినియోగం చేసుకోకుంటే ప్రభుత్వం చేయగలిగిందని ఏమీ లేదని.. తాము ఎవరినీ బుల్డోజ్‌ చేయడం లేదన్నారు.

telangana rtc updates

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article