20న కలెక్టర్లతో కేసీఆర్ సమావేశం .. ఎందుకంటే

KCR Collector meet on this month 2oth

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్ట రూపకల్పనకు కలెక్టర్ లనుండి అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం ప్రగతిభవన్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. అంతేకాదు మూడు ముఖ్యమైన అంశాల పైన కలెక్టర్లతో చర్చించనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రెండు రోజుల పాటు సాగే అవకాశం కూడా కనిపిస్తోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త చట్టాల గురించి చర్చించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన సీఎం క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగే విధంగా, అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి సమస్య తలెత్తకుండా చట్టాన్ని రూపొందించాలి అంటే వాటి నియమ నిబంధనలు ఎలా ఉండాలి అన్న దానిపై జిల్లా కలెక్టర్లతో విస్తృతంగా చర్చించనున్నారు సీఎం.
క్షేత్ర స్థాయిలో పనిచేసిన అనుభవం ఉన్న కలెక్టర్లతో సమావేశం ద్వారా తమ అనుభవంలో ఉన్న విషయాలను, ఎదురయ్యే ఇబ్బందులను, ఏ విధంగా చట్టాన్ని తయారు చేస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు వంటి అంశాలపై చర్చ జరిపి కొత్త చట్టం రూపకల్పనలో సూచనలను కలెక్టర్ల వద్ద నుంచి తీసుకోవాలనుకుంటున్నారు కేసీఆర్‌. ఇందుకోసం కలెక్టర్లు కూడా అభిప్రాయాలు, సూచనలు చెప్పడానికి.. చర్చలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమై రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అంతే కాకుండా కొత్త మున్సిపల్ చట్టం, కొత్త పంచాయతీ రాజ్ చట్టం అమలుపైన కూడా సమావేశంలో చర్చించనున్నారు. రాబోయే 60 రోజుల్లో పల్లెలు పట్టణాల్లో అమలు చేయబోయే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉన్నందున రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది.

RK VS Lokesh

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article