8 మంది మంత్రులతో కేసీఆర్ క్యాబినెట్ విస్తరణకు రెడీ

KCR expanding cabinet with 8 ministers

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో పడ్డారు. ఆ దిశగా ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి? పదవులు దక్కని అసంతృప్తులను ఎలా బుజ్జగించాలి? అని యోచిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గులాబీ దళపతి ఇప్పటికే మంత్రి పదవులపై ఓ స్పష్టతకు వచ్చేశారు. ఇక అసంత్రుప్తులకు మంత్రి హోదాలో ఉండే పార్లమెంటరీ కార్యదర్శిగా అవకాశం ఇస్తారని టాక్ .
కేసీఆర్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మహబూబ్ అలీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనకు హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మంచి ముహూర్తాల్లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడింది. తిరిగి మంచి రోజులు రానుండటంతో ఈ నెల మూడో వారంలో అంటే మరో 10 రోజుల్లో కేబినెట్ ను విస్తరించాలని సీఎం యోచిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ సాధారణ పరిపాలన శాఖకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.నిబంధనల ప్రకారం తెలంగాణ మంత్రివర్గంలో 18 మంది కంటే ఎక్కువ మంత్రులు ఉండకూడదు. దీంతో ఆ స్థానాలను ఎవరికి ఇవ్వాలనే విషయంపై రెండు రోజులుగా కేసీఆర్ కసరత్తులు ముమ్మరం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ ఈ నెల 3వ వారంలో తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో విస్తరించబోరు. కేవలం 8 మందినే తీసుకుంటారు.
ఈ 8 మందిలో ఒకరు మహిళా మంత్రి ఉండటం ఖాయమని తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున కూడా ప్రస్తుతం కేసీఆర్ అవకాశం కల్పిస్తారని ,బీసీల నుంచి ఇప్పుడు ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెడతారని సమాచారం. మిగిలిన మూడు స్థానాలను ఓసీల కోటా కింద భర్తీ చేసే అవకాశముంది. కేసీఆర్ గత కేబినెట్ లో 18 స్థానాలకు గాను 11 ఓసీలు, నలుగురు బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. తాజా కేబినెట్ లో మైనారిటీ కోటా కింద హోంమంత్రిగా మెహబూబ్ అలీని ఇప్పటికే కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article