KCR GIFT TO GOLLAKURMAS
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కానుక గా సీఎం కేసీఆర్ శనివారం రెండో విడత గొర్రెల పంపిణీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ కు గొల్ల కురుమల కుటుంబాల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు మన రాష్ట్రంలో లేవు…వచ్చే అవకాశం లేదు, నిన్నమొన్న కొన్ని ఏరియాలో కోళ్లు చనిపోయాయి అని వార్తలు వచ్చాయి కానీ మహా రాష్ట్ర నుండి వచ్చిన గొర్రెలు వాతావరణం సహకరించక చనిపోయాయి. సీఎం కేసీఆర్ ఏమైనా పథకాలు ప్రకటిస్తే చట్టం చేసినట్లే. తెలంగాణ లో కొన్ని చోట్ల కోళ్లు చనిపోయిన మాట నిజం.. అవి పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడంతో వాతావరణంలో మార్పు వల్ల చనిపోయింది
బర్ద్ ఫ్లూ ను ఎదుర్కొనేందుకు 13 వందల టీమ్ లు రెడీగా ఉన్నాయి. డీడీలు కట్టిన 28 వేల 335 మందికి సబ్సిడీపై గొర్రెల పంపిణీ కి గ్రీన్ సిగ్నల్. రూ. 360 కోట్ల వ్యయం తో గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ చేస్తాం. ఈ నెల 16 న నల్గొండలో గొర్రెల పంపిణీ రెండో విడత ప్రారంభిస్తాం. ఆఖరి కుటుంబం వరకు గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీ చేస్తాం. ఈనెల 12 నుండి హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 20 వెల లీటర్ల ఉచిత నీళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. జిహెచ్ఎంసి ఎన్నికల హామిలో భాగంగా ప్రకటన చేశారు ఇప్పుడు అమలు చేస్తున్నాం.అంతేకాదు వరదల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు 10 వేల రూపాయలు చెల్లించాం. జిహెచ్ఎంసి ఎన్నికల లో భాగంగా బీజేపీ వాళ్ళు 25 వేలు ఇస్తాం అని చెప్పారు కానీ ఎక్కడ ఇవ్వడం లేదని విమర్శించారు.