సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ అందుకేనా

KCR Greens signal for sangareddy Medical COllege

సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ లో జగ్గారెడ్డి పడుతున్నారా? సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ విషయంలో సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందుకేనా? ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జోరందుకుంటే ఇక పార్టీ తీరుపై అసహనం తో ఉన్న జగ్గారెడ్డి ని సీఎం తన ట్రాప్ లోకి లాగుతున్నారా అంటే తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తుంది.
చాలా కాలంగా సంగారెడ్డి మెడికల్ కాలేజ్ గురించి జగ్గారెడ్డి పోరాటం చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ స్పందించిన సీఎం అనూహ్యంగా సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు.ఇదంతా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఒక భావన ఉంది.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి నాలుగేళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ తీసుకువస్తానన్న ఆయన హామీ నెరవేరేందుకు బీజం పడింది. మెడికల్ కాలేజీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు జగ్గారెడ్డి. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి కాలేజీ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యతనిస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి కి రావాల్సిన మెడికల్ కళాశాలను సిద్దిపేట కు తరలించారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే , అప్పటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత నాలుగేళ్లుగా ఆందోళన చేశారు. సంగారెడ్డి కి తక్షణమే మెడికల్ కాలేజీ మంజూరు చేయాలంటూ నిరాహార దీక్షలు, బంద్ సైతం నిర్వహించారు. మెడికల్ కళాశాల అంశాన్నీ ఏదో ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లో ఉంచుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. మెడికల్ కళాశాల సిద్దిపేట తరలి వెళ్తుంటే అడ్డుకోలేకపోయన అసమర్థుడని టీఆరెస్ పార్టీ కి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను దుమ్మెత్తి పోశారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి లో తన ప్రచార అస్త్రంగా జగ్గారెడ్డి వాడుకున్నారు. జగ్గారెడ్డి గెలుపు లో మెడికల్ కళాశాల ఆందోళన ప్రధాన పాత్ర వహించింది. సంగారెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత సైతం జగ్గారెడ్డి సంగారెడ్డి కి మెడికల్ కళాశాల తీసుకురావడమే తన మొదటి ప్రాధాన్యతగా చెప్పారు. 20 రోజుల క్రితం సంగారెడ్డి లో జరిగిన కార్యకర్తల సమావేశం లో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. సంగారెడ్డికి సీఎం మెడికల్ కళాశాల మంజూరు చేస్తే కనీ వినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతానని చెప్పారు.సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే సీఎం కేసీఆర్ కు సంగారెడ్డిలో కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతానని జగ్గారెడ్డి అనడంపై సీఎం కేసీఆర్ స్పందించారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించడం జగ్గారెడ్డి చొరవపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే సంగారెడ్డిలో నియోజకవర్గ ప్రజలకు మెడికల్ కాలేజీ సాధిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చినందుకు కృతజ్ఞతగా ఎవరూ ఊహించని రీతిలో సీఎంను స్వాగతిస్తామని చెప్పిన జగ్గారెడ్డి, ఇక ఈ కారణంతో కెసిఆర్ కు జై కొడతారేమో అన్న అనుమానం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. ఇటీవల పరిణామాలు గమనించినట్లయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నుండి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చిన సీఎం కేసీఆర్ మాత్రం చాలా సానుకూలంగా వారందరూ ఫిదా అయ్యేలా స్పందిస్తున్నారు.ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article