ద‌ళితుల‌కు అన్యాయం చేసింది కేసీఆరే

100
KCR has done injustice to dalits
KCR has done injustice to dalits

హుజురాబాద్ ఉపఎన్నికల వచ్చిన్నప్పటి నుంచి కేసీఆర్ కొంగజేపం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఉద్యమంలో దళితులను ఉపయోగించుకొని ఒక పాచిక లాగా వాడుకున్నారని.. ఏడున్నర ఏండ్లలో కేసీఆర్ అంబెడ్కర్- జగ్జీవన్ జయంతి- వర్ధంతి నివహించలేదన్నారు. ఇంకా ఏమ‌న్నారంటే..

నెక్లెస్ రోడ్డులో ప్రపంచమే అబ్బురపడే విధంగా అంబేద్క‌ర్‌ విగ్రహం పెడుతా అని ఇప్పటికీ తత్తమట్టి తియ్యలేదని తెలిపారు. మూడెకరాల భూమి ఇచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతా అని మాట తప్పారు. దళితుల అభివృద్ధి కోసం ఒక్క సమీక్ష కూడా ముఖ్యమంత్రి చెయ్యలేదు. ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వకపోవడం వల్ల సురేష్ నాయక్- లావణ్య లాంటి విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన వారిని థర్డ్ డిగ్రీ- మరియమ్మ ను చంపిన చరిత్ర టీఆరెస్ ప్రభుత్వానిది. దళితులకు అన్యాయం చేసిన వాళ్లలో మొదటి దోషి- ముద్దాయి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమ‌ర్శించారు.

  • అంబేద్కర్- బాబు జగ్జీవన్ ను- దళితులను కేసీఆర్ ఇన్నేళ్లు అవమానించారు. దళితబంధు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారు. అబద్ధాల పునాదుల మీద బీటలు పారుతున్న గులాబీ కోటలను కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. అంబెడ్కర్ పేరుమీద పెట్టిన ప్రాణహిత చేవెళ్ల గురించి ఏ ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడారా? ప్రాణహిత చేవెళ్ల లోపాల గురించి- ప్రాజెక్టు రిడిజైన్ గురించి కేసీఆర్ ఉద్యమంలో ఏనాడైనా ఉద్యమంలో ప్రశ్నించారా? తెలంగాణ ఉద్యమంలో మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ గురించి ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలోని చాలా గూడాల్లో నీళ్లపైపు కనేషన్స్ ఇంకా రాలేదు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల మట్టిని కాంట్రాక్టర్లకు అమ్ముకున్న చరిత్ర టీఆరెస్ ది. చెరువుల్లో మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు టీఆరెస్ నాయకులు సంపాదించారు. మిషన్ కాకతీయ పై నిజనిర్ధారణ కమిటీ వెయ్యాలి. కాళేశ్వరం ప్రాజెక్టు- మిషన్ కాకతీయ- మిషన్ భగీరథ ప్రాజెక్టులు ప్రజల కోసం కాదు- ప్రజాధనం దోచుకోవడానికి! ఏడేళ్ల కాలంలో దళితులకు- గిరిజనులకు ఒక్క పైసా దక్కలేదు.
  • ఒక్క శాసనసభ గెలవడానికి కేసీఆర్ నిచానికి దిగజారారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడానికి సొబమ్మను తెరమీదకు తెచ్చారు. కేసీఆర్ తన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మని ముందు వేస్తున్నారు. కేసీఆర్ ఈరోజు నుంచి సచ్చినపాము లెక్క!. దళితబంధు సభలో కేసీఆర్ మాటలు వింటుంటే జాలి కలిగింది. కేసీఆర్ నీచమైన రాజకీయాలకు శోభమ్మకు సంబంధం లేదు. ఒక్క ఎన్నిక కోసం శోభమ్మని చర్చలోకి లాగడం కేసీఆర్ స్థాయికి తగదు. దళితుల కోసం ఉన్న 4వేలకు పైగా ఉన్న సింగిల్ టీచర్ స్కూల్స్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ మూసివేయించారు!. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దళిత- గిరిజనులు విద్యకు దూరం అయ్యారు. ఉద్యోగాలు టైంకు ఇస్తే ఏడేళ్లలో 60వేల గౌట్ ఉద్యోగాలు దళిత- గిరిజనులకు వచ్చేవి. 9 లక్షల 50వేల మంది కార్పొరేషనళ్లలో దరఖాస్తులు పెట్టుకుంటే ప్రభుత్వం పక్కన పెట్టింది.
    శాసనసభ సమావేశాలు వెంటనే నిర్వహించాలి. రూ. 30 లక్షల మందికి- ప్రతి కుటుంబానికి 10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వు.
  • దళితబంధు పై శాసనసభలో ఒకరోజు చర్చ జరపి- తీర్మానం చెయ్యాలి. ఆరు నెలల లోపు ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటే మేము ఎక్కడైనా సంతకాలు పెడుతాం. కేసీఆర్ ను త్వరలో బంజరు దోడ్ల తోలేరోజులు త్వరలో రాబోతున్నాయి. హుజురాబాద్ లో తుపాన్ రాబోతోంది. ఆ తుపాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతారు. హుజురాబాద్ దళితసభ కేసీఆర్ మాటల్లో పిరికితనం కనిపిస్తోంది. అల్కామీర్ మండిలో ఉన్నట్లు దళితబంధు సభలో టీఆరెస్ నేతలు కనిపించారు. పదవులు గడ్డిపోషతో సమానం అన్న కేసీఆర్ ఎందుకు భయంతో ఉన్నారు. దళితులను మోసం చేస్తున్నందుకు కేసీఆర్ ఇంటిముందు చావు డప్పు మోగిస్తాం. ఇబ్రహీంపట్నం పట్నం సభ తరువాత హుజురాబాద్ పై దండయెత్తుతాం. రాజకీయంగా కేసీఆర్ దళితబంధు సభనే చివరి ఉపన్యాసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here