ఆయిల్ పాము సాగు వైపు కేసీఆర్ ఆసక్తి

80

రాష్ట్రంలో అయిల్ పామ్ సాగు పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆసక్తిగా ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రగతిశీల, చైతన్యవంతులైన ఆసక్తికల రైతులు ఉన్నారని వారిని సెన్సిటైజ్ చేసి ఆయిల్ పామ్ సాగును చేపట్టేలా కృషి చేయాలని, దీనివల్ల దిగుమతుల కోసం అయ్యే వ్యయం తగ్గుతుందని ప్రధాన కార్యదర్శి అన్నారు. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు పెంచడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులతో బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సరీల ఏర్పాటు , నాణ్యమైన మొలకల దిగుమతి, రాష్ట్రంలో కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రైవేట్ సంస్థల గుర్తింపు మరియు ఇతర సౌకర్యాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు, టిఎస్ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్, హార్టి కల్చర్ డైరెక్టర్ వెంకట్ రామి రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖీల్, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ సుష్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here