KCR Made Fund Raising

KCR Made Fund Raising

KCR has made a large number of fundraisers for his hometown of Chintamadaka. This is a situation where Harish Rao has facing problem . That the KCR is the CM of the whole of the state of Telangana, he is not the only CM of his own village.Netizens are hulking on social media that the whole state needs to be developed along the lines of Chintamadaka. Also, once you remember the allegations leveled against YS Rajasekhar Reddy questioned Tanneer Harish Rao .

KCR fundraisers to chintamadaka create problems to harish rao …questioning in social media

కేసీఆర్ తన సొంతూరైన చింతమడక కు భారీ ఎత్తున నిధుల కేటాయింపులు చేసేసారు. దీంతో హరీశ్ రావుకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి . సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సీఎం అని, తన సొంత గ్రామానికి మాత్రమే ఆయన సీఎం కాదని చాలామంది ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది.ఇక కొందరైతే ఛ.. చింతమడకలో పుట్టినా బాగుండేది అని తెగ సెటైర్లు వేస్తున్నారు. ఇక చింతమడక గ్రామం తరహాలో రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో తన్నీరు హరీష్ రావు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలను ఒకసారి గుర్తు చేసి మీ మామనైతే నిలదీయవా అంటూ ప్రశ్నిస్తున్నారు.

DAILY HOROSCOPE

చింత మడకపై కేసీఆర్ వరాల జల్లు … హరీష్ రావుకు తెచ్చింది తిప్పలు .. ఆటాడుకుంటున్న నెటిజన్లు

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కెసిఆర్ తన సొంతూరు చింతమడకపై ఎక్కడలేని ప్రేమ చూపించారు. ఏకంగా ఒక ఊరి కోసం 200 కోట్ల నిధులను కేటాయించారు. కెసిఆర్ ఇంతగా ప్రేమ చూపించిన చింతమడక గ్రామం హరీష్ నియోజకవర్గంలోనిదే కావడంతో హరీష్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత ఊరు చింతమడక పై చూపించిన ప్రేమ పై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కెసిఆర్ చేసిన ఈ పని ఇప్పుడు మేనల్లుడు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

చింతమడకకు భారీ నిధులు కేటాయించటంపై రాష్ట్ర వ్యాప్త చర్చ ..

కేసీఆర్ తన సొంతూరైన చింతమడక కు భారీ ఎత్తున నిధుల కేటాయింపులు చేసేసారు. దీంతో హరీశ్ రావుకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి . సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి సీఎం అని, తన సొంత గ్రామానికి మాత్రమే ఆయన సీఎం కాదని చాలామంది ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది.ఇక కొందరైతే ఛ.. చింతమడకలో పుట్టినా బాగుండేది అని తెగ సెటైర్లు వేస్తున్నారు. ఇక చింతమడక గ్రామం తరహాలో రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. అంతేకాదు గతంలో తన్నీరు హరీష్ రావు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై చేసిన ఆరోపణలను ఒకసారి గుర్తు చేసి మీ మామనైతే నిలదీయవా అంటూ ప్రశ్నిస్తున్నారు.

నాడు వైఎస్ పై మాట్లాడిన మీరు కేసీఆర్ ను ప్రశ్నించరా ? ఆయన రాష్ట్రానికి సీఎం అన్న విషయం మర్చిపోయారా ? హరీష్ పై ఫైర్

ఇక అసలు విషయానికి వస్తే కేసీఆర్ రాష్ట్రానికి సీఎం అన్న విషయం మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు నెటిజన్లు. సీఎం హోదాలో కేసీఆర్ తన సొంతూరికి చేసిన కేటాయింపుల మాదిరే.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం పులివెందులకు ఆయన సీఎంగా ఉన్న సమయంలో భారీ కేటాయింపులు చేశారు. నాడు వైఎస్ తీసుకున్న నిర్ణయంపై హరీష్ నిప్పులు చెరిగారు.. ఇప్పుడు వైఎస్ మాదిరే కేసీఆర్ తన సొంతూరికి చేసిన కేటాయింపులపై నోరు మెదపరా అంటూ నెటిజన్లు హరీశ్ ను నిజంగానే ఓ ఆట ఆడేసుకుంటున్నారు.వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు కెసిఆర్ తరహాలోనే నాడు వైఎస్ ఒకేసారి రూ.200 కోట్లను కేటాయించారు.

విపక్షంలో ఉన్న సమయంలో వై ఎస్ ను నిలదీసిన హరీష్ ..పులివెందులకు మాత్రమే రూ.200 కోట్లు కేటాయించారని నిలదీత

నాడు విపక్షంలో ఉన్న హరీశ్ రావు.. పులివెందులకు వైఎస్ కేటాయింపులపై ఓ రేంజిలో మండిపడ్డారు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేదంటే కడప జిల్లాకో, రాయలసీమకో, ఆంధ్రా ప్రాంతానికో ముఖ్యమంత్రా? అంటూ వైఎస్ ను నిలదీశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా చేయాలని వైయస్ పై నిప్పులు చెరిగిన హరీష్ రావు ఇప్పుడు మామ విషయంలో నోరు మెదపడం లేదు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అప్పట్లో ఒక్క పులివెందులకు మాత్రమే రూ.200 కోట్లు కేటాయించడమంటే ప్రాంతీయతత్వాన్ని ఎగదోస్తున్నట్లు కాదా? అని విరుచుకుపడ్డ హరీష్ ఇడుపులపాయకు, పులివెందులకు, వాళ్ల ఎస్టేట్లు ఉన్న ప్రాంతాలకు ఫోర్ లైన్ల రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు.

BAGVAT GEETA IN TELUGU BOOK

కేవలం ఒక్క వూరికే నిధులా .. అప్పుడు వైఎస్ తరహాలో మామను ప్రశ్నించండి అంటున్న నెటిజన్లు

ఈ క్రమంలో వైఎస్ ను ప్రాంతీయ వాదిగా పేర్కొన్న హరీష్ రావు ప్రాంతీయ వాదిగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని ప్రాంతీయ వాదులంటారా? అంటూ కూడా వైఎస్ ను నిలదీశారు. నాడు వైఎస్ విషయంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ పెట్టిన నెటిజన్లు… మరి ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏంటి అంటూ ప్రశ్నించారు. మీరు అక్కడే ఉండి కూడా నోరుమెదప లేదు ఎందుకు అని నిలదీశారు . ఇక కెసిఆర్ కంటే వైఎస్ నయం అని ఆయన తన నియోజకవర్గానికి రూ.200 కోట్లు కేటాయించారు ఇప్పుడు కేసీఆర్ ఏకంగా తన సొంతూరికి మాత్రమే రూ.200 కోట్లు కేటాయించారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయంపై హరీష్ నోరుమెదపాలని , మామను నిలదీయాలని అటు నెటిజన్లు, ఇటు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article