రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన కేసీఆర్

కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గం బేతవోలు గ్రామ ప్రజలతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా చేశాడు కేసీఆర్. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులు చేశాడు. తెచ్చినా డబ్బంతా కేసీఆర్ ఇంట్లో కమీషన్ల రూపం లో వెళ్ళింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి 70 వేల కోట్లు కాజేశారు. టీఆరెఎస్ పార్టీ కార్యాలయానికి 110 కోట్లు విలువజేసే స్థలాన్ని కేవలం 5 లక్షలకు కేటాయించారట అని అన్నారు. కేసీఅర్ కు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వడానికి స్థలాలు కనిపించవు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి స్థలాలు కనిపించవు. టీఆరెఎస్ పార్టీ కార్యాలయాలకు మాత్రం కోట్ల విలువజేసే స్థలాలు కనిపిస్తాయి. ఇదేనా బంగారు తెలంగాణ. కేసీఅర్ కుటుంబానికి అయ్యింది బంగారు తెలంగాణ.కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఏ వర్గానికి న్యాయం చేయలేదని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article