నల్లారిని మించుతున్నకేసీఆర్

kcr more than nallari

https://en.wikipedia.org/wiki/Narendra_Modi

తెలంగాణ మొత్తం అమరవీరుల ఆత్మ బలిదనాలతో తడిసి ముద్ద అయిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాల వల్ల ఆత్మహత్య లు జరిగితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మూర్ఖపు పోకడలవల్ల ఆత్మహత్య లు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.  ఖమ్మం ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి మృతి బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య లు చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయని తెలిపారు. ఏనాడు ఉద్యమం చేయని మంత్రులు ఆర్టీసీ కార్మికుల పై మాట్లాడటం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులకు చివరి వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అందరూ సంయమనం పాటించాలన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఒక్క శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదు, ఇంకా చాలామంది కార్మికులు గుండెపోటుతో మరణించారని చెప్పారు. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఏవిదంగా అణచి వేయలని చూసారో అంతకుమించి ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తి పోశారు.

– పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కార్మికుల పై ఉక్కుపాదం మోపుతున్నారని, కార్మిక, ఉద్యోగ సంఘాల్లో చీలిక తేవాలని ముఖ్యమంత్రి చూడటం బాధాకరమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపలేదు కానీ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఆపడం దారుణమన్నారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో అనేక దసరా, దీపావళి పండుగలను ఆర్టీసీ కార్మికులు కోల్పోయారని గుర్తు చేశారు. ఉద్యమం లో ఉండి రాజకీయ పార్టీల ప్రోద్బలంతో సమ్మె చేస్తున్నారని టీఎన్జీవో నాయకులు అనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమం లో ఉండి మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. మీ తోటి తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, విఆర్ఓ, వీఆర్ఏలు, ఆర్టీసీ కార్మికులు పస్తులుంటే టీఎన్జీవో నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారన్నారు.

BJP LATEST NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *