కేసీఆర్ నయా స్కీమ్

KCR New Scam

మంత్రులుగా కాకున్నా ఆ హోదా ఇచ్చే వ్యూహం

తెలంగాణా రాష్ట్రంలో గులాబీ బాస్ తన పార్టీలోని సీనియర్ నాయకులకు పదవుల విషయంలో అసంతృప్తి లేకుండా చేసే మెగా ప్లాన్ సిద్ధం చేశారు. ఒక పక్క మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల పద్దెనిమిదో తేదీన మంత్రివర్గ విస్తరణ జరపాలని నిర్ణయించుకున్నారు గులాబీ బాస్ . ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఇక మంత్రులుగా ఎనిమిది మందితో మాత్రమే ప్రమాణస్వీకారం చేయించబోతున్నారని తెలుస్తోంది. . అయితే తమ పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న చాలా మంది నేతలను సంతోష పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ కొత్త స్కీం కు రూప కల్పన చేస్తున్నారు. అయితే మంత్రులుగా ప్రమాణస్వీకారాల్లేకుండానే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలకు “మంత్రి” హోదా ఇవ్వ బోతున్నారు. హోదా అమంత్రిది కానీ పేరు మాత్రం మంత్రి అని ఉండదు. వారికి పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులనే పేరు ఉంటుంది. హోదా మంత్రి హోదా అయినప్పుడు ఏ పేరు ఉంటే ఏంటి
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఇద్దరే మంత్రుల తొలి కేబినెట్‌ మీటింగ్ పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఓకే చెప్పింది. ఇక గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ పేరును పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులుగా మార్చారు. గతంలో కోడా పార్లమెంటరీ కార్యదర్శి నియామకాలు చేసినా కోర్టు వాటిని కొట్టివేసింది. ఇక దానితో ఆ పదవులను వదులుకోవాల్సి వచ్చింది. అయితే న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా గతంలో కోర్టు చెప్పినవాటిని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ హోదాలను దృష్టి లో పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. వాస్తవానికి రాజ్యాంగంలోని 164 నిబంధన ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మందిని మాత్రమే మంత్రులుగా నియమించే వీలుంది. ఇతరులను పార్లమెంటరీ కార్యదర్శల పేరుతో నియమించినా.. కోర్టులు కొట్టి వేశాయి. అయినప్పటికీ.. పేర్లు మార్చి.. కొన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నారు. అదే పద్దతిని కేసీఆర్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక కోర్టు సమస్య రాకుండా నిబంధనలు సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు హోదా మంత్రిది కానీ మంత్రిలా నేరుగా ప్రమాణం చేయరు . ఇక వారికి మంత్రికి సంబంధించిన అధికారాలన్నీ ఉంటాయి. అయితే… న్యాయపరమైన చిక్కులున్న నేపధ్యంలో కేబినెట్ హోదా ఇచ్చే అవకాశం లేదు. ఇక వారు కూడా అవసరం అయితే మంత్రుల తరపున అసెంబ్లీలో సమాధానం చెప్పేలా చట్టంలో మార్పు తేవాలని నిర్ణయించారు. నిజానికి గతంలోనే..పార్లమెంటరీ కార్యదర్శులు ఉన్నారు. కానీ కోర్టు కొట్టేయడంతో… వారిని తప్పించారు. మళ్లీ నియమించలేదు. ఈ సారి కొత్త పేరుతో నియమించాలని నిర్ణయించారు. పేరు మార్చి కేసీఆర్ చేస్తున్న ప్రయోగం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో. అప్పట్లో కోర్టు చేసిన వాఖ్యలను పరిగణనలోకి తీసుకొని కొత్తనిబంధనలు తేవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. మంత్రి పదవులు దక్కలేదని అసంతృప్తికి గురయ్యేవారిని.. ఈ పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శల పదవులతో… కేసీఆర్ సంతృప్తి పరచనున్నారు. మరి ఈ నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సక్సెస్ అయినా కాకున్నా కేసీఆర్ కు ఓకే .. ఎండుక్నతే తాను అవకాశం ఇచ్చినా కోర్టే అభ్యంతరం చెప్పింది అని సముదాయించి తనదేమి తప్పు లేదు మాట ప్రకారం అవక్కాశం ఇచ్చా అని చెప్పొచ్చు. ఏమన్నా తెలివా… అందుకే ఆయన గులాబీ బాస్ అయ్యింది. తెలంగాణాను ఏలుతుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article