సిరిసిల్ల నియోజకవర్గ పంచాయితీలకు బంపర్ ఆఫర్

KCR Gave A bumper offer SIRISILA constituency Panchromatic

తెలంగాణాలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షలతో పాటూ, స్వతహాగా తన ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.15 లక్షలు ఇవ్వనున్నట్లు ఆఫర్ చేశారు. సిరిసిల్ల పరిధిలో ఉన్న పంచాయితీలు అన్ని కూడా ఏకగ్రీవం కావాలని తెరాస పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపొందేలా కృషి చేయాలనీ కేటీఆర్ పిలుపునిచ్చారు.
తనని గెలిపించిన సిరిసిల్ల ప్రజల ఋణం తీర్చుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీతో గెలిచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని.. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్‌వైపే ఉన్నారని స్పష్టమయ్యిందన్నారు. మన దేశం గర్వపడేలాగా సీఎం పరిపాలన కొనసాగనుంది ప్రజలకు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాన్ని మోడీ కూడా అమలు చేయనున్నారు. అని ప్రసంగించారు కేటీఆర్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article