KCR PLANS TO DISCUSS WITH JAGAN ON FEDERAL FRONT
ఫెడరల్ ఫ్రెంట్ లో, కలిసి వచ్చే విషయంపై వైఎస్ఆర్సీపీతో చర్చలు జరపాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు. వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో చర్చలు జరపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సీనియర్ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు హైదరాబాదులో జగన్ తో కేటీ రామారావు బృందం చర్చలు జరుపుతుంది.