అందుకే కొత్త రెవెన్యూ చట్టం : సీఎం కేసీఆర్

31
Non Agricultural Lands Registration @ 23rd
Non Agricultural Lands Registration @ 23rd

KCR Press meet with Revenue employees (Tressa)

రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీ ఆర్ సూచించారు. శనివారం ప్రగతి భవన్ లో ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదని, రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే ప్రవేశపెట్టామని అన్నారు.

రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పించుకోకుండా వెంటనే పనిచేయాలన్నారు. వ్యవస్థపై నమ్మకం కలిగేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.  వివిధ పనులపై రెవెన్యూ కార్యాయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. అధికారులు తమతో ఎలా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తుంటారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెవెన్యూ యంత్రాంగం వారి సమస్యలను పరిష్కరించే విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.  రెవెన్యూ ఎన్నో బాధ్యతలను చక్కగా చేస్తున్నారని, అన్ని స్థాయిల్లో పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేస్తామని స్పష్టం చేశారు. తహసీల్దార్లకు రిజిస్ర్టేషన్ బాధ్యతలు అప్పగించినందుకు ట్రెసా ప్రతినిధులు సీఎం కు థ్యాంక్స్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here