195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి

63
Kcr Request Letter to Amit shah
Kcr Request Letter to Amit shah

నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. గతంలో 9 జిల్లా పోలీసు కార్యాలయాలు, 2 పోలీసు కమిషనరేట్లు ఉండేవని.. ప్రస్తుతం పాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన జరిగిందన్నారు. 20 జిల్లా పోలీసు కార్యాలయాలు, 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు జరిగిందన్నారు. 2016లో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష జరిగింది. 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో కలిపి మొత్తం 139 ఐపీఎస్ పోస్టులను కేంద్ర హోంశాఖ ఆమోదించింది. ప్రస్తుతం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు ఏర్పాటు జరిగింది. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here