మూడేండ్లలో పూర్తి చేసి.. దేశానికే కేసీఆర్ ఆదర్శం

Kcr Role Model to Indian Leaders

బాల్కా సుమన్.. అసెంబ్లీలో భలే దంచేశాడు. తన వాక్పటిమతో సభను మొత్తం ఆకట్టుకున్నాడు. సీఎం కేసీఆర్, హరీష్ రావు ల తర్వాత తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల గురించి అనర్గళంగా మాట్లాడగలిగే ఎమ్మెల్యే.. బహుశా బాల్క సుమనే అన్నట్లుగా దంచేశాడు. ఆయన మాట్లాడుతుంటే సభ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందంటే ఆయన ఏ స్థాయిలో స్పీచ్ ఇచ్చాడో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సాదాసీదా డిగ్రీ చదివే పిల్లగాడిని ఈ స్థాయికి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఆయన సభలో ఘంటాపథంగా చెప్పారు. ఉద్యమం రోజుల్నుంచి సీఎం కేసీఆర్ను దగ్గర్నుండి గమనిస్తున్నానని.. ఆయనకు బంగారు తెలంగాణ గురించి ఆలోచనలే తప్ప మరోటి లేవన్నారు. ఆ తపనతోనే కాళేశ్వరం తీర్చిదిద్దారని, మూడేండ్లలో ఒక ప్రాజెక్టును పూర్తి చేయడమంటే అసలు మన దేశంలో సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. మన భారతదేశంలో గతంలో ఎప్పుడైనా సాధ్యమైందా అని అడిగారు. కాళేశ్వరాన్ని మ్యాన్ మేడ్ వండర్గా అభివర్ణించారు. అందుకే, ఇటీవల ఎన్నికల్లో ఒకటే నినాదంతో ముందుకెళ్లామని, కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? అని ప్రజలను అడిగితే.. ప్రజలంతా కాళేశ్వరమే కావాలని గతం కంటే ఎక్కువ సీట్లను కట్టబెట్టారని తెలిపారు.

మూడేండ్లలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు పారించిన ఘనత మన కేసీఆర్ దేనని ప్రశంసించారు. మూడేండ్లలోనే ఒక ప్రాజెక్టును ఎలా కట్టాలో భారతదేశంలోని నాయకులకు కళ్లకు కట్టినట్లు చూపెట్టారని కొనియాడారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అధ్యక్షులు, దేశ నాయకులు సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలన్నారు. ఒక సంవత్సరంలోనే కావాల్సిన అనుమతులన్నీ తెచ్చుకుని మరీ కాళేశ్వరం పూర్తి చేశారని, ఇది కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.  నల్లగొండకు సంబంధించిన ఫ్లోరైడ్ సమస్య మీద సీఎం కేసీఆర్ స్వయంగా పాట రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండ ప్రజలు కొన్నేండ్ల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

kcr is eligible for prime minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *