Every Thing is ready for KCR SAHASRA CHANDIYAGAM
సీఎం కేసీఆర్ రేపట్నుంచి నిర్వహించనున్న మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సర్వం సిద్ధమైంది. సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లి వ్యవపాయ క్షేత్రంలో ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపట్నుంచి ఐదురోజుల పాటు చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శారదాపీఠం వేద బ్రహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మూడు యాగశాలలతో పాటు 27 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. కర్నాటకకు చెందిన శృంగేరి పీఠానికి చెందిన 200 మంది రుత్వికులు, స్థానిక వేద పండితులు ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. మూడేళ్ల కిందట కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీయాగం ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు.
ఈ నెల 21 నుంచి 25 వరకు సహస్ర చండీ యాగం నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేశారు . గజ్వెల్ సమీపంలోని ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు ఈ మహా క్రతువు నిర్వహిస్తున్నారు. చతుర్వేద పండితులు మాడుగుల మాణిక్య సోమయాజి నేతృత్వంలో ఈ మహా కార్యాన్ని చేపట్టారు. సుమారు 250 మంది రుత్వికుల వేద పారాయణాల మధ్య ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఈ యాగంలో తొలి రోజు వంద పారాయణాలు, రెండో రోజు రెండు వందలు, మూడో రోజు మూడు వందలు, నాలుగో రోజు నాలుగు వందలు మొత్తంగా వెయ్యి పారాయణాలు ఉంటాయి. ఐదో రోజు హోమం, పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అవుతుంది. కార్యక్రమంలో భాగంగా చతుర్వేద మహా యాగం, బ్రాహ్మణం పురాణ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో నరేంద్ర కాప్రే ఆధ్వర్యంలో వైదిక నిర్వహణలు, జనమంచి సీతారాం ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణాలు ఉంటాయి.