హామీ నెరవేర్చేందుకు కేసీఆర్ సంచలన నిర్ణయం

KCR  SENSATIONAL DECISION

ఆయన భాషా పండితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. తెలుగు భాషను బోధించే ఉపాధ్యాయుల కష్టాలను తెలుసుకున్నారు. తెలుగు భాషకు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పీఈటీల పోస్టులను.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తామంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారు. దాంతో తెలంగాణలో ఇకపై గ్రేడ్-2 పండిట్ల పోస్టులుండవు. ఈ నిర్ణయంతో వేలాది మంది భాషా పండితులకు మేలు జరగనుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article