కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ ముఖ్యమంత్రి..

104
KCR should become PM,
KCR should become PM,

KCR should become PM, KTR next CM: Gangula

టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ , రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ , తనయుడు కేటీఆర్ లు చక్రం తిప్పాలని ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు . టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని కమలాకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాసే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 40 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని పేర్కొన్నారు. ఇక భవిష్యత్ లో  సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని, కేటీఆర్ తెలంగాణా సీఎం అన్న సంకేతాలు ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చెయ్యటం గమనార్హం .

KCR should become PM, KTR next CM: Gangula,telangana, cm kcr, ktr, working president , gangula kamalakar , trs party , elections,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here