పీఆర్సీ పై కేసీఆర్ సంతకం?

105

పీఆర్సీ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారని సమాచారం. నేటి సాయంత్రానికి లేదా రేపు ఫిట్మెంట్, మరియు ఇతర తొమ్మిది జీవోలపై ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే, రేపటి క్యాబినెట్ ముందుకు పీ ఆర్ సీ అంశం చర్చకు వస్తుందని.. ఉద్యోగుల వేతన సవరణ నివేదికను క్యాబినెట్ ఆమోదిస్తుందని సమాచారం. వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ ఇప్పటికే సమర్పించింది. పీ ఆర్ సీ కి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. గత అసెంబ్లీ సమావేశాలలో పిఆర్సీని అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here