తెలంగాణాలో కాంగ్రెస్ విలీనానికి కేసీఆర్ పక్కా స్కెచ్

KCR Sketch for merging telangana Congress

తెలంగాణలో విజయవంతంగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేసీఆర్.. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కి ముచ్చెమటలు పట్టే వ్యూహం రచించారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేలా స్కెచ్ వేశారని తెలుస్తోంది. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటారా? చూడండి మీకే తెలుస్తుంది! ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జ‌ల తీర్పు, రాజ్యాంగ నిబంధ‌న‌లు, శాస‌న‌స‌భ నియ‌మాలు.. ఇవేవీ మ‌న తెలంగాణలోని ప్ర‌ధాన రాజ‌కీయ నేత‌ల‌కు ప‌ట్ట‌వు. ఓట్ల‌ప్పుడు నానా తంటాలు ప‌డ‌టం, ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఖ‌ర్చు పెట్ట‌టం, త‌ద్వారా గెలిచి ఐదేండ్ల‌పాటు జ‌నం నెత్తిన కూర్చోవ‌టం.. ఇవి త‌ప్ప వారికేవీ న‌చ్చ‌వు అంతేకాదు గిట్ట‌వు కూడా. ఒక‌వేళ ఎవ‌రైనా అభ్యుద‌య వాదులు వీటి గురించి మాట్లాడినా తేలిగ్గా కొట్టిపారేస్తుంటారు మ‌న పొలిటీషియ‌న్స్‌. ఈ కోవ‌లో ఎవ‌రికైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కంటే అర్హ‌త‌, స‌మ‌ర్థ‌త క‌ల‌వారు మ‌రెవ‌రూ ఉండ‌రేమో!
ఇప్పుడు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వేదిక‌గా అధికార పార్టీ చేస్తున్న వ్యూహాలు ఇదే అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయి.గ‌త ఐదేళ్లలో టీడీపీని మొత్తానికి మొత్తంగా గులాబీ పార్టీలోకి విలీనం చేస్తున్నట్టుగా హడావుడి చేసేశారు కేసీఆర్. దీంతో ఆయనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందేమో! అందుకే ఇప్పుడు కాంగ్రెస్ వంక చూస్తున్నారు కేసీఆర్. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేలా వ్యూహ రచన చేశారట. సాంకేతికంగా చెల్లుతుందా, విమర్శలు వస్తాయా.. అనే లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టోట‌ల్‌గా టీఆర్ఎస్‌లోకి విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడట కేసీఆర్. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ బాస్ తో జోరుగా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేల్లో మూడింట రెండువంతుల మందిని ఒకేసారి తెరాసలోకి చేర్చుకునే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి రాజీనామా చేరారు కాబట్టి.. అసెంబ్లీలో కాంగ్రెస్ ను తెరాసలోకి విలీనం అయినట్టుగా స్పీకర్ కు లేఖను ఇచ్చే రాజకీయం నడవబోతోందని సమాచారం. ఇప్పటికే ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసతో చర్చల్లో ఉన్నారట. అయితే కాంగ్రెస్ నుండి 13 మందిని చేర్చుకోవాలి అనేది తెరాస ఆలోచన అట. ఆ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కరిని ఒక్కోసారి కాకుండా.. 19 మందిలో 13 మందిని ఒకేసారి చేర్చుకుని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రసమితిలోకి విలీనం అయిపోయిందని ప్రకటించేయనున్నారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదే జరిగితే తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ ఖతం అయినట్లే…చూడాలి మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article