ఎన్పీఆర్ కు బ్రేకులు వేసిన సీఎం కేసీఆర్…

KCR Stoped NPR In Telangana

దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30లోగా జనాభా లెక్కల సేకరణను పూర్తిచేయాలని నిర్ణయించారు. జనగణనతో పాటే జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) వివరాలను కూడా నవీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రక్రియను ప్రస్తుతానికి ఆపివేశారు. ఎన్పీఆర్ విషయంలో పలు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జాతీయ జనాభా పట్టిక తయారు చెయ్యాలని  కేంద్రం నుంచి వచ్చిన సూచనల మేరకు తెలంగాణ జనగణన విభాగం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. జనాభా లెక్కల సేకరణ ఎన్పీఆర్ కోసం జనగణన విభాగం అన్ని జిల్లాలు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులను నియమించింది. జిల్లాలకు కలెక్టర్లు కార్పొరేషన్లకు కమిషనర్లు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు మండలాలలో తాసిల్దార్లు ఆ బాధ్యతను నిర్వహిస్తారు. ఇదిలాఉండగా జనగణన విభాగం రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేసింది. జిల్లా స్థాయిలో శిక్షణ కొనసాగుతున్నట్టు తెలిసింది. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కానీ రాష్ట్రమంతటా పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి ఉంది.  ఆ తర్వాత వెంటనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఈ ప్రక్రియ గురించి ఆలోచించి, అడుగు వేయాలని  సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే ప్రస్తుతానికి ఎన్పీఆర్ కు బ్రేక్ వేశారు.
KCR Stoped NPR In Telangana,telangana, cm kcr, NPR, CAA,National population register , break , pattana pragathi, assembly session

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article