తనయుడి కోసం కేసీఆర్ మళ్ళీ హరీష్ ని టార్గెట్ చేశారా

KCR Targeted Harish Rao for HIS SON Politics

కేసీఆర్ హరీష్ రావుల మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదంటారు. కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల ఎఫెక్ట్ మేనల్లుడు హరీష్ రాజకీయ భవిష్యత్ పై ప్రభావం చూపనుంది. తనయుడు కేటీఆర్ కోసం హరీష్ రావు టార్గెట్ గా కెసిఆర్ మరోమారు వ్యూహరచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలోలా ఇప్పుడు కూడా సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు వార్తలపై నమస్తే తెలంగాణ పత్రికలో బ్యాన్ విధించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఇటీవల కాలంలో హరీష్ లో పాల్గొన్న పలు కార్యక్రమాలకు సంబంధించి నటువంటి వివరాలను కేవలం జిల్లా పేజీలో ఒక చిన్న కాలంలో పరిమితం చేసి రాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
హరీష్ రావు కు సంబంధించిన వార్తలను ప్రకటించ వద్దని ఎడిటోరియల్ టీం కు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్లుగా సమాచారం.
గత మూడు రోజులుగా గమనిస్తే స్థానికంగా హరీష్ రావు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు కేవలం జిల్లా పేజీలో ఎక్కడో ఒక మూలన కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో హరీష్ రావు పైన జగ్గారెడ్డి వంటి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సైతం హరీష్ రావు మెదక్ జిల్లాలో వ్యతిరేకతను పెంచే ఆలోచనలో భాగంగానే సాగుతున్నాయి. ఇక అదే సమయంలో ఒంటేరు ప్రతాపరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం సైతం హరీష్ రావ్ టార్గెట్ గా నే అని తెలుస్తోంది. ఇక తాజాగా హరీష్ దగ్గర ఓ ఎస్ డి గా పనిచేసిన శ్రీధర్ రావు పాండే ను కేసీఆర్ తన ఓఎస్డీగా నియమించుకోవడం కూడా హరీష్ ను పక్కకు పెట్టే ఆలోచనలో భాగమని అర్థమవుతోంది.

మంత్రివర్గ విస్తరణలో సైతం హరీష్ కు స్థానం లేదని పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి హరీష్ విషయంలో గులాబీ బాస్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడానికి హరీష్ చేసిన నేరమేంటి అని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం కొడుకు కోసం మేనల్లుడి రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అన్న టాక్ పార్టీ శ్రేణుల లోనే వినిపిస్తుంది. ఏది ఏమైనా హరీష్ విషయంలో కేసీఆర్ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కేసిఆర్ కే తెలియాలి. ఈ వ్యవహారంలో హరీష్ భవిష్యత్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది . ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ జరిగితే హరీష్ వ్యవహారంపై ఒక క్లారిటీ వస్తుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article