హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ తెరాస అధిష్ఠానం రకరకాల పేర్లను పరిశీలించింది. అయితే, చివరికీ శ్రీనివాస్ యాదవ్ పై నమ్మకం ఉంచినట్లు సమాచారం. తనకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉన్నట్లుగా టీఆర్ఎస్ భావిస్తోంది. ఏదీఏమైనప్పటికీ, ఈటెల రాజెందర్ ను శ్రీనివాస్ యాదవ్ ఢీకొట్టే సత్తా ఉన్నట్లుగా భావించినట్లు ఉంది. అందుకే, ఆయన వైపే మొగ్గు చూపిందని తెలిసింది. ఈ అంశంలో టీఆర్ఎస్ అధికారిక ప్రకటన వెలువడితే తప్ప అభ్యర్థి ఎవరో తెలియదు
హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్?
